అభ్యర్థి మార్పుపై ఎలాంటి అపోహలకు తావులేదు..ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
కదిరి మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి మార్పుపై ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ స్పష్టత నిచ్చారు. పట్టణం లోని ఎమ్మెల్యే స్వగృహం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకే అభ్యర్థి మార్పు జరిగిందని, ఈ విషయంలో పార్టీ శ్రేణులు, ప్రజలు ఎలాంటి అపోహ లకు గురికావద్దని వివరించారు.పార్టీ నిర్ణయాన్ని గౌర విస్తూ డైమండ్ ఇర్ఫాన్ మనస్ఫూర్తి గా సహకరించడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొ న్నారు. పార్టీ ఐక్యత, క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తూ నాయకులు, కార్యకర్తలందరూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.కదిరి మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా టీడీపీ తరఫున అర్షియా బాను పేరును ప్రకటించిన నేపథ్యంలో, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు మద్దతుగా నిలవా లని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కోరారు. అభ్యర్థి మార్పుపై అనవసర చర్చలకు తావి వ్వకుండా, పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఎన్నికల ప్రక్రియలో సమన్వ యంతో ముందుకు సాగాలని ఆయన తెలిపారు.