అభివృద్ధి పథంలో డైరీ టెక్నాలజీ కళాశాల -రికార్డు స్థాయిలో 2026లో ప్రవేశాలు
ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో కాలేజ్ ఆఫ్ డైరీ టెక్నాలజీ కళాశాల అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. 2026 ప్రవేశాలలో ఘననీయమైన వృద్ధి సాధించినట్లు అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ డాక్టర్ జి గంగరాజు పేర్కొన్నారు. 2026లో 21 మంది బాలురు, 13 మంది బాలికలు ప్రవేశం పొందారు. 2010 నుంచి పోలిస్తే 2026లో మొత్తం ప్రవేశాలు 26 నుంచి 34కు పెరిగాయి. ఇది కళాశాల విద్యా వాతావరణం, మౌలిక వసతులు, ప్రయోగశాలలు, ప్రాసెసింగ్ సౌకర్యాలు, మానవ వనరుల అభివృద్ధితో పాటు డెయిరీ టెక్నాలజీ విద్యపై పెరుగుతున్న విద్యార్థుల ఆసక్తిని ప్రతిబింబిస్తోంది.
ప్రవేశాల్లో గణనీయమైన వృద్ధి
2010 నుంచి 2026 వరకు విద్యార్థుల ప్రవేశాలను పరిశీలిస్తే మధ్యలో కొన్ని సంవత్సరాల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, ఇటీవల సంవత్సరాల్లో స్పష్టమైన వృద్ధి సాధించినట్లు పేర్కొన్నారు. గత దశాబ్దన్నర కాలంలో విద్య, మౌలిక వసతులు, బోధన, పరిశోధన, ప్రాయోగిక శిక్షణ రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిందన్నారు.
మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా
కళాశాల అభివృద్ధిలో భాగంగా వివిధ విభాగాలకు ప్రత్యేక భవనాలు ఏర్పాటుతో పాటు మౌలిక వసతులు కల్పనే లక్ష్యంగా సాగుతుందన్నారు. డెయిరీ మైక్రోబయాలజీ, డెయిరీ కెమిస్ట్రీ విభాగానికి ప్రత్యేక భవనండెయిరీ ఇంజినీరింగ్ విభాగానికి ప్రత్యేక భవనం & పాలు, ఐస్క్రీమ్ ప్రాసెసింగ్ ప్లాంట్ "క్షీర భవన్" విద్యార్థులకు ప్రాసెసింగ్ సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేశామన్నారు. యూజీపిజి విద్యార్థుల అవసరాలు చేర్చే విధంగా నూతన శాతవాహన బాలుర వసతి నిర్మాణం చేపట్టామన్నారు. ఈ మౌలిక వసతులు విద్యార్థులకు తరగతి గది బోధనతో పాటు ప్రయోగశాలలు, ప్రాసెసింగ్ ప్లాంట్ మరియు పరిశ్రమ ఆధారిత ప్రాయోగిక శిక్షణకు అవసరమైన వాతావరణాన్ని కల్పించమన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి