BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

అభివృద్ధి అజెండాగా రాజకీయ నిర్ణయం --యువ నేత బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి

Select Suryaa Now
అభివృద్ధి అజెండాగా రాజకీయ నిర్ణయం  --యువ నేత బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి

ఆత్మకూరు, మేజర్ న్యూస్:
ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధి ఏకైక అజెండాగా తాము రాజకీయ నిర్ణయం తీసుకున్నామని మున్సిపల్ ఎన్నికల్లో చైర్పర్సన్ అభ్యర్థిగా తమ తల్లి డాక్టర్ షకీలాను పోటీ చేయిస్తున్నామని యువ నేత, బి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి పేర్కొన్నారుm అనూహ్యం గా మారిన రాజకీయ పరిణామాల్లో బొమ్మిరెడ్డి కుటుంబంలోని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బొమ్మిరెడ్డి సుందర్ రామిరెడ్డి కోడలు, మాజీ మండలాధ్యక్షుడు డాక్టర్ బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి సతీమణి, యువ నేత బొమ్మిరెడ్డి తారక్నాథరెడ్డి తల్లి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ పదవికి కూటమి అభ్యర్థిగా ఆదివారం నామినేషన్ దాఖలు వేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వారిని ఆహ్వానించి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా, డాక్టర్ బొమ్మిరెడ్డి తారకనాథరెడ్డి, డాక్టర్ బొమ్మిరెడ్డి గీతికా రెడ్డి లకు  తెలుగుదేశం కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించి స్వయంగా ఆయనే దగ్గరుండి నామినేషన్ దాఖలు చేయించారు. ఈ సందర్భంగా తారక్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ గతంలో 2009లో ఇక్కడ శాసనసభ్యులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మాత్యులుగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరులో అనూహ్యంగా  అభివృద్ధి పరిచారని,నాటి నుండే తన మదిలో ఆనం నాయకత్వం, ఆత్మకూరు అభివృద్ధి నిలిచిందన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా మళ్లీ ఆత్మకూరు ఎమ్మెల్యేగా, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరుకు అనూహ్యంగా నిధులు సాధిస్తూ అభివృద్ధి పథంలో నిలుపుతున్నారని, దాంతో తాము ఆకర్షితులమై ఆయన నాయకత్వంలో ఆత్మకూరు అభివృద్ధికి కృషి చేయాలన్న ఏకైక తలంపుతో తెలుగుదేశం అభ్యర్థిగా కూటమి ఆధ్వర్యంలో పోటీ చేస్తున్నామని అభివృద్ధి ఏకైక అజెండాగా తాము రాజకీయ నిర్ణయం తీసుకున్నామే తప్ప ఎలాంటి ఇతర  ఆలోచనలు లేని లేవని తారక్ నాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఆనం రామనారాయణరెడ్డి అపార అనుభవశాలి అని, పెద్ద పథకాలను, అధికంగా నిధులను సాధించగల సమర్థత ఉన్న నాయకుడని, 40 సంవత్సరాలుగా అనేక దపాలు శాసనసభ్యులుగా, అనేక శాఖల మంత్రిగా వ్యవహరించిన ఆనం సారధ్యంలో ఆత్మకూరు అనూహ్యంగా అభివృద్ధి చెందుతుందని, రానున్న రెండున్నర సంవత్సరంలో మరింతగా ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధి చెందగలదన్న ఆకాంక్షతో తమ వంతుగా ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి అనాదిగా తమ కుటుంబాన్ని ఆదరిస్తున్న ఆత్మకూరు పట్టణ ప్రజలకు సేవలు అందించాలని, ఆత్మకూరును అభివృద్ధి పరచాలన్న లక్ష్యంగా తమ తల్లి పోటీ చేస్తుందని తారక్ నాథ్ రెడ్డి పేర్కొన్నారు.