BREAKING
ఆదాయార్జన శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాళహస్తి పట్టణం మున్సిపల్ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ భయం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా: మండల ప్రజా ప్రతినిధులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన గూడూరు వెంకటేశ్వర్లు స్థూల విలువ జోడింపు (GVA) పెంపునకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* మూగజీవుల దాహం తీర్చేలా చర్యలు కూటమి ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యం బలోపేతం టీడీపీ నేత ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ కె. పెదపూడి గ్రామంలో జోరు వానలో ఎన్నికల ప్రచారంలో రాయపురెడ్డి కూటమి నేతలు జోరు రైతులకు, వ్యాపారస్తులకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో విస్తృత రుణ పథకాలు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం అట్రాసిటీ కేసుల్లో స్టేషన్ బెయిల్ రద్దు చేయాలి తెలుగు సినిమాల్లో డ్రగ్స్, మద్యం దృశ్యాలపై నిఖిల్ సిద్ధార్థ్ ఘాటు వ్యాఖ్యలు! తీర్థప్రసాదాలు స్వీకరించని జగన్మోహన్ రెడ్డికి రాముడి పేరు పలికే అర్హత లేదు – ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు నవంబర్ 30లోగా రైతులకు సవరించిన అడంగల్ కాపీలను రిజిస్టర్డ్ పోస్టు ద్వారా ఇంటి వద్దకే పంపిణీ* *మ్యుటేషన్ దరఖాస్తుల్లో ప్రస్తుత పోస్టల్ చిరునామాను సరిగ్గా, పూర్తిగా, తప్పనిసరిగా నమోదు చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం: ఎంసీపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్

ఆత్మకూరులో తొమ్మిది పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నిక --నియోజకవర్గం లో 52పంచాయతీలు ఏకగ్రీవం

Select Suryaa Now
ఆత్మకూరులో తొమ్మిది పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నిక --నియోజకవర్గం లో 52పంచాయతీలు ఏకగ్రీవం

 

ఆత్మకూరు, మేజర్ న్యూస్: ఆత్మకూరు మండలంలో తొమ్మిది గ్రామ పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తికాగా తొమ్మిది పంచాయతీల్లో ఒక్కో అభ్యర్థి మాత్రమే నామినేషన్ మిగలడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించామని ఎంపీడీవో పి. రఫీ ఖాన్ పేర్కొన్నారు.బట్టేపాడు సర్పంచ్ గా వాసిపల్లి ఆదిలక్ష్మమ్మ,చెర్లోయడవల్లి సర్పంచ్ గా తాటిపర్తి సుజాత, కనుపూరు పల్లి సర్పంచ్ గా ముళ్ళపూడి నరసింహయ్య, మహిమలూరు సర్పంచ్ గా మద్దినేని కల్పన, నాగులపాడు సర్పంచ్ గా సయ్యద్ నాయబ్ రసూల్, నారంపేట సర్పంచ్ గా చిట్టి మల్ల నాగ భవాని, రామస్వామి పల్లి సర్పంచ్ గా మెంతెం విష్ణువర్ధన్ రెడ్డి, రావులకొల్లు సర్పంచిగా సూరి పోగు బాబు, వాసిలి సర్పంచిగా సుంకర పెంచల చౌదరీలు  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ తొమ్మిది పంచాయతీల్లో వాసిలి మినహా మిగతా ఎనిమిది పంచాయతీల్లో వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో మొత్తం 21 గ్రామపంచాయతీలు ఉండగా తొమ్మిది పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగతా 12 పంచాయతీల్లో పోటీలు జరగనున్నాయి.
ఆత్మకూరు నియోజకవర్గంలో 135 గ్రామ పంచాయతీలు ఉండగా 52పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.కూటమి బలపరిచిన వారే సర్పంచ్ లుగా, వార్డ్ మెంబర్లు గా ఎన్నికయ్యారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆశీస్సులు పొందినవారే సర్పంచ్ లుగా ఎన్నికయ్యారు.
*ఒక లైన్ అంతా ఏకగ్రీవాలే *
ఆత్మకూరు మండలంలో ఒక మార్గంలో ఉన్న అన్నీ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ మార్గంలో ఉన్న అన్ని పంచాయతీలు ఏకగ్రీవం కావడం విశేషం. ఆత్మకూరు -నాగులపాడు మార్గంలోని రావులకొల్లు, చెర్లో యడవల్లి, నాగులపాడు, మహిమలూరు, నారంపేట, రామస్వామిపల్లి పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మండలంలో 9పంచాయతీలు ఏకగ్రీవం కాగా అందులో ఆరు పంచాయతీలు ఓకే మార్గంలో ఉండడం విశేషం.