BREAKING
దసరా సెలవులు.. విద్యార్థులకు అవస్థలు! జై శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో, ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు* పాకల బీచ్ విషాదంపై ఎమ్మెల్యే తాటిపర్తి దిగ్భ్రాంతి.. "సంతాపంతో సరిపెట్టొద్దు తాగునీరు కరువు.. రోడ్డెక్కిన కాలనీవాసులు *పూల పండుగకు శ్రీకారం.. పల్లెల్లో బతుకమ్మ సందడి!* *•ఆటపాటలతో అంబరాన్నంటిన సంబురాలు* కోటి రూపాయలతో రోడ్డు పనులకు శంకుస్థాపన సముద్రపు దీపస్తంభాల అద్భుత రూపాంతరం త్రివేణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు వారణాసిలో ఫిట్ ఇండియా సైకిల్ యాత్ర...ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రేపు తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో మెగాస్టార్ చిరంజీవి పర్యటన దసరా సంబరాల టెండర్లలో గోల్‌ మాల్‌ - ఎసి విచారణ - టెండర్లు రద్దు? తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి కేటీఆర్ అండ ముగ్గురు ఆడబిడ్డల పేరిట ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ గాంధీ ఫౌండేషన్ సేవలు అభినందనీయం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ 299 డివిజన్ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సాయిపేట శ్రీనివాస్ ఫిలిప్స్ రికాల్ వివాదంలో విజయం సాధించిన డచ్ దిగ్గజం

ఆత్మకూరు గడ్డపై మరో విద్యా మణిహారం

Select Suryaa Now
ఆత్మకూరు గడ్డపై మరో విద్యా మణిహారం

సంగం మేజర్ న్యూస్  :     విద్యా, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి రంగాల్లో మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సంగం మండలం తరుణవాయి వద్ద ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల ఏర్పాటుకు చర్యలు వేగవంతమయ్యాయి.
తరుణవాయి వద్ద లగడపాటి ఫౌండేషన్ సహకారంతో గతంలో నిర్మించిన భవనాలు, ఇతర మౌలిక వసతులతో కూడిన రూ.100 కోట్లకు పైగా విలువైన ఆస్తులను విద్యాభివృద్ధికి వినియోగించాలని మంత్రి ఆనం కార్యాచరణ రూపొందించారు. ఈ ప్రాంగణంలో ప్రభుత్వ ఐటీఐతో పాటు రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, సాంకేతిక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆత్మకూరు ప్రాంతాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది మంత్రి లక్ష్యంగా ఉంది.

సంగం ఐటీఐ అభివృద్ధికి రూ.5 కోట్ల సీఎస్ఆర్ నిధులు ...

మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక చొరవకు బిర్లా గ్రూప్ స్పందించింది. సంగం ఐటీఐ అభివృద్ధికి కార్పొరేట్ సామాజిక బాధ్యత 
సిఎస్ ఆర్ నిధుల నుంచి రూ.5 కోట్లు కేటాయించేందుకు సంస్థ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ నిధులతో ఐటీఐకి అవసరమైన మౌలిక వసతులతో కూడిన నూతన భవన బ్లాక్‌ను నిర్మించేందుకు ముందుకొచ్చారు.
ఈ నేపథ్యంలో ముంబై నుంచి వచ్చిన బిర్లా గ్రూప్ ప్రతినిధులు అరుణ్ సింగ్, జయదేవ్ తదితరులు తరుణవాయి వద్ద అందుబాటులో ఉన్న భవనాలు, స్థల విస్తీర్ణం, మౌలిక వసతులు, నూతన భవన నిర్మాణానికి ఉన్న అవకాశాలను అధికారులతో కలిసి పరిశీలించారు.
అనంతరం నెల్లూరులో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాతో బిర్లా గ్రూప్ ప్రతినిధులు సమావేశమయ్యారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అభ్యర్థన మేరకు సంగం ఐటీఐ అభివృద్ధికి రూ.5 కోట్ల సీఎస్ఆర్ నిధులతో నూతన భవన బ్లాక్ నిర్మించేందుకు సంస్థ సిద్ధంగా ఉందని కలెక్టర్‌కు వివరించారు.
నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించేందుకు అవసరమైన సాంకేతిక అంశాలు, కార్యాచరణ ప్రణాళిక, సంబంధిత శాఖల సమన్వయంపై సమావేశంలో చర్చించారు. మంత్రి ఆనం మార్గదర్శకత్వంలో ప్రాజెక్టును త్వరితగతిన కార్యరూపంలోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నారు.
సంగం ఐటీఐ అభివృద్ధి పూర్తయితే ఆత్మకూరు ప్రాంతంలోని గ్రామీణ యువతకు సాంకేతిక విద్య, నైపుణ్య శిక్షణతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. విద్యాసంస్థల ఏర్పాటుతో ఆత్మకూరు నియోజకవర్గాన్ని విద్యా, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ ప్రాజెక్టు కీలక మైలురాయిగా నిలవనుంది.
ఈ పరిశీలన, సమావేశ కార్యక్రమాల్లో సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, రెవెన్యూ శాఖల అధికారులు, ఐటీఐ ప్రిన్సిపల్, మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల టీడీపీ నాయకులు బాణా శ్రీనివాసులు రెడ్డి, నీటి సంఘ అధ్యక్షులు ఎస్.కె బాబు మరియు టీడీపీ నాయకులు,  మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కార్యాలయ ప్రతినిధులు పాల్గొన్నారు.