BREAKING
శీతాకాల విమాన సర్వీసుల వేళ నవీ ముంబై ఎయిర్‌‌పోర్ట్ బహుళ రవాణా అనుసంధానం విస్తరణ కోనసీమ పోలీస్ శాఖలో నూతన డాగ్ కెన్నెల్ ప్రారంభం.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలి :జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్.. అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్.. నో యువర్ లీడర్’ సమనస జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని భవ్య శ్రీ.. పరిమళ ప్రసాదం కొరత తీర్చేందుకు మెగా ప్రాజెక్టు ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. 17వ డివిజన్‌లో అదరగొట్టిన ఫ్లాష్ మాబ్స్.. - విజయవాడ ఉత్సవ్ 2.0కు విస్తృత ప్రచారం ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయిలో పరిష్కరించాలి సాంప్రదాయ విలువలను భావితరాలకు అందించాలి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ దసరా విశేష సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల దసరా ఏర్పాట్లపై దేవాదాయ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన పేద కుటుంబాలకు అండగా నిలుస్తాం.. సమాజ సేవకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి బీసీలకు న్యాయం జరిగేలా రిజర్వేషన్లు నేటి రాశి ఫలాలు: 6 అక్టోబర్ 2026 (మంగళవారం)

ఆశీర్వాద దీపం వెలిగించిన ఎమ్మెల్యే

Select Suryaa Now
ఆశీర్వాద దీపం వెలిగించిన ఎమ్మెల్యే

 అనపర్తి మేజర్ న్యూస్.: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు నిర్వహిస్తున్న  సేవా సంకల్ప్‌ అభియాన్‌ లో భాగంగా రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు వద్ద ‘ఆశీర్వాద దీపం’ను వెలిగించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, రూడా చైర్మన్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి, బీజేపీ సీనియర్‌ నాయకులు ఏపీఆర్‌ చౌదరి, వీరన్న చౌదరి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప్‌ అభియాన్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నాయని చెప్పారు.ప్రజా సేవే పరమావధిగా భావిస్తూ మోదీ 25 ఏళ్లుగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, స్వచ్ఛత కార్యక్రమాలు తదితర సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడే సంకల్పంతో ‘సేవా దీపం’, ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నల్లమిల్లి, సేవా సంకల్ప్‌ అభియాన్‌ను విజయవంతం చేస్తున్న ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.