ఆసక్తికరంగా కందివలస ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం
పూసపాటిరేగ, సూర్య : మండలంలోని కందివలస ఎంపీటీసీ సెగ్మెంట్ కు సంబంధించి స్థానిక పోరు ఆసక్తికరంగా మారింది. కందివలస సెగ్మెంట్ ఆన్ రిజర్వ్ మహిళకు కేటాయించగా కూటమి సీట్ల పంపిణీలో తెదేపాకు చెందిన కూని శెట్టి గోవిందకు కాకుండా జనసేనకు సీట్ కేటాయించడంతో గోవిందా తన సతీమణి అయిన కూని శెట్టి రాజేశ్వరి ని బరిలోకి దించి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గతంలో పంచాయతీకి చేసిన సేవలతో పాటు తమ బంధువులు, సన్నిహితులతో మమేకమవుతూ ఎంపీటీసీగా గెలిపిస్తే కందివలస తో పాటు గనిమెట్ట పంచాయతీలను అభివృద్ధి చేస్తానంటూ గోవిందు స్వతంత్రఅభ్యర్థిని రాజేశ్వరితో కలిసి ప్రచారాన్ని నిర్వహిస్తూ మహిళలు, యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజేశ్వరి ఎన్నికల ప్రచారంలో మహిళలు అడుగడుగునా హారతులు పట్టడంతో రాజేశ్వరి విజయంపై పలువురు భీమాన వ్యక్తం చేస్తున్నారు