ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న స్వచ్ఛంద సంస్థల ప్రముఖులు.
కావలిమేజర్ న్యూస్ : ఇటీవల నెల్లూరు ఆసుపత్రిలో వివిధ అనారోగ్య సమస్యలకు శస్త్రచికిత్సలు, అత్యవసర వైద్యం పొంది ఇళ్ల వద్ద విశ్రాంతి తీసుకుంటున్న 'మీకోసం సేవా సంస్థ' అధ్యక్షులు రాయపాటి దిలీప్ కుమార్ ధర్మపత్ని సుప్రియ మరియు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఎం. అజిత్ బాబులను పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సోమవారం ఆత్మీయంగా పరామర్శించారు.
స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షుడు షేక్ బాషా ఆధ్వర్యంలో నాయకులు వారి ఇళ్లకు వెళ్లి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొస్తారని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా షేక్ బాషా మాట్లాడుతూ, సమాజానికి సేవలు అందిస్తున్న సేవాకర్తలంతా తమకు ఆత్మీయులని, వారి సంక్షేమానికి ఎల్లప్పుడూ తమ సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు.
ఈ ఆత్మీయ పరామర్శ కార్యక్రమంలో రత్నమ్మ ఫౌండేషన్ ప్రతినిధి ఎం.వి. ప్రసాదరావు, ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ దామ మధుసూదన్‌రావు, హ్యాపీ సేవా సంస్థ ఎస్.డి. ఘనీ బాషా, టైమ్ టు హెల్ప్ ఎన్. రమేష్, గుడ్ మెన్ ఎస్. బ్రహ్మయ్య, విశ్రాంత ఉప తహసీల్దార్ మొఘల్ శిరాజ్ బేగ్, లోక్‌సత్తా ఎం. మాలకొండారెడ్డి, విశ్రాంత లైబ్రేరియన్ ప్రభాకర్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.