BREAKING
కోగిలిలో టీడీపీ అభ్యర్థి కమతం చెంగయ్య ఘన విజయం 454 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు.. టీడీపీ శ్రేణుల సంబరాలు ఆధార్ సెంటర్ కు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి.. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అద్దంకి జెడ్పీటీసీ పీఠం కైవసం చేసుకున్న టీడీపీ. 7,650 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన మానం మురళీమోహన్ దాస్. బీఆర్ఎస్ పాపానికే మేడిగడ్డ కూలింది తెలంగాణ రాష్ట్ర మరియు ఖేడ్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఎన్నాళ్లీ ప్రమాదాల పరంపర.. చెరువు అన్నారం స్టేజ్‌ వద్ద సూచిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయరా? కూటమి శ్రేణులతో విజయోత్సాహాన్ని పంచుకున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నందవరం జడ్పిటిసిగా అక్క మహాదేవి విజయం గుడిపల్లిలో టీడీపీ విజయదుందుభి రష్యాలో జపాన్ టొబాకో ఆస్తులను స్వాధీనం చేసుకున్న పుతిన్ బెర్క్‌షైర్ హాత్వే త్రైమాసిక లాభాల్లో క్షీణత...భారీగా పెరిగిన షేర్ల బైబ్యాక్ కొనుగోళ్లు ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల రేసులో మెలంచన్ సంచలన హామీలు ఆమదాలవలస మండలం కూటమి కైవసం * ఒకే ఒక్క స్థానంలో వైసిపి గెలుపు * గాజాలో భారీ వర్షాలు, వరదలతో వణికిపోతున్న శరణార్థులు

ఆళ్లగడ్డ తెదేపా జెడ్పిటిసి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఘన విజయం

Select Suryaa Now
ఆళ్లగడ్డ తెదేపా జెడ్పిటిసి  పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఘన విజయం


ఆళ్లగడ్డ మేజర్ న్యూస్: ఆళ్లగడ్డ మండల జెడ్పిటిసి అభ్యర్థిగా పో రెడ్డి రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. శనివారం స్థానిక ఎద్దుల పాపము ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల కౌంటింగ్ కార్యక్రమం జరిగింది. 18,605 ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. ఎన్నికల అధికారుల చేతుల మీదుగా ఆయన డిక్లరేషన్ పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన విజయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లకే అంకితం అన్నారు. ఆళ్లగడ్డ మండల ప్రజలకు రుణపడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, సీనియర్ తాలూకా తెదేపానాయకులు భార్గవ రామ్ నాయుడు, తెదేపా యువ నాయకులు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే మండల తెదేపా నాయకులకు కార్యకర్తలకు, జనసైనికులకు బిజెపి కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ఆళ్లగడ్డ మండల ప్రజల రుణం తీర్చుకుంటారని పో రెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.ఆళ్లగడ్డ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపించడం తన కెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.

శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా