BREAKING
ఏడవకపోతే రూ. కోటి.. ఏడిస్తే రూ. లక్ష.. అల్లు అరవింద్‌తో ఖరీదైన బెట్ ఓడిపోయిన సుకుమార్ వృషకర్మ వర్సెస్ అలియాస్ రుక్మిణి.. డిసెంబర్ 4 బాక్సాఫీస్ పోరులో గెలిచేదెవరు వేములవాడలో ఆధునిక పోస్టాఫీస్ భవన నిర్మాణానికి కృషి చేస్తా - బండి సంజయ్ కుమార్ హామీ దొడగట్ట సర్పంచ్ రామాంజినేయులు కు ఘనంగా సన్మానం.. అలియాస్ రుక్మిణిపై నాని సంచలన వ్యాఖ్యలు.. అలా అనిపించకపోతే సినిమాలు మానేస్తా పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. నేడు తులం రేటు ఎంతంటే బిగ్ బాస్ తెలుగు 10 నుంచి టెంపర్ వంశీ ఎలిమినేషన్.. 12 వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే డిసెంబర్ 1న వికారాబాద్‌కు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాక అచ్చంపేట ఎస్సీ రిజర్వేషన్ మరో 25 ఏళ్లు కొనసాగించాలి వత్సవాయిలో ప్రారంభమైన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ చంద్రారెడ్డి ఇంట విషాదం.. భార్య అనసూయ కన్నుమూత వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా నూజివీడును తీర్చిదిద్దుదాం --స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర లో జిల్లా స్థాయి అవార్డులలో నూజివీడు మున్సిపాలిటీకి ప్రథమస్థానం అభినందనీయం

Select Suryaa Now
ఆదర్శవంతమైన  మున్సిపాలిటీగా  నూజివీడును తీర్చిదిద్దుదాం --స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర లో జిల్లా స్థాయి అవార్డులలో నూజివీడు మున్సిపాలిటీకి ప్రథమస్థానం అభినందనీయం

 నూజివీడు,సూర్య న్యూస్: పట్టణం విజయవాడ రోడ్డులో మామిడితోటలో సోమవారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లాస్థాయి అవార్డులలో నూజివీడు మున్సిపాలిటీ ప్రథమస్థానం సాధించిన సందర్భంగా మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, వాటరు వర్క్స్, విద్యుత్తు సిబ్బందికి ఆత్మీయ అభినందన సమ్మేళనం కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ముఖ్య అతిథిగా పాల్గొని, 200 మందికి నూతన వస్త్రాలను బహురించి ఘనంగా సన్మానించారు. అనంతరం మున్సిపల్ శానిటేషన్ సిబ్బందితో కలిసి సహబంతి భోజనం చేసి రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి వారిలో జోష్ నింపారు.ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండున్నర ఏళ్లలో నూజివీడు మున్సిపాలిటీని రూ 70 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామని అన్నారు. రానున్న కాలంలో రూ 150 కోట్లతో రాష్ట్రంలోనే నూజివీడు మున్సిపాలిటీని కలిసికట్టుగా పనిచేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ జిల్లా స్థాయి అవార్డులలో  నూజివీడు పురపాలక సంఘం  ప్రథమస్థానం దక్కించుకోవడం అభినందనీయం, ఆదర్శనీయం  అన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో నిరంతరం శ్రమిస్తున్న మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, వాటరు వర్క్స్, విద్యుత్తు సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.పట్టణ పరిశుభ్రత అనేది ఒక్క రోజుతో పూర్తయ్యేది కాదని, నిరంతర శ్రమతోనే సాధ్యం  అవుతుందని పేర్కొన్నారు. ఎండనక, వాననక ప్రజా ఆరోగ్యం కోసం పాటు పడుతున్న పారిశుద్ధ్య కార్మికులు అంకితభావం, కఠిన శ్రమ ఎంతయినా ఉందని అన్నారు. అధికారులు సమన్వయం, పట్టణ ప్రజలు భాగస్వామ్యంతోనే నూజివీడు మున్సిపాలిటీ జిల్లాలో అగ్రస్థానంలో నిలిచిందని కొనియాడారు. ​రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో రాష్ట్రస్థాయిలో మన ఏలూరు జిల్లాను, జిల్లాలో మన నూజివీడు మున్సిపాలిటీ ఆదర్శంగా నిలిచేలా సమష్టి కృషిచేద్దామని అన్నారు. పట్టణాన్ని మరింత సుందరవదనంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనరు కొరపాటి.పీరయ్య, పట్టణప్రముఖులు,మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, ఇంజనీరింగు అధికారులు, ఉద్యోగులు, వాటరు వర్క్స్, విద్యుత్తు సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు వారి కుటుంబ సభ్యులు, పట్టణ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

 పసుమర్తి రాము జిల్లా ఇంచార్జ్