నగరపాలక సంస్థ పరిధిలోని 56వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గా బ్యాంకు శాంతమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బ్యాంకు శాంతమ్మ తెలుగుదేశం పార్టీ నగర మహిళా అధ్యక్షురాలుగా 12 సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్నారు. మూడు దశాబ్దాలకు పైగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ పార్టీ అధిష్టానం ఆదేశాలను తూచా పాటిస్తూ పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తీసుకెళ్ళుతూ ప్రజల మన్ననలను పొందారు. బ్యాంకు శాంతమ్మ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేశారు. పార్టీ బలోపేతం కోసం, పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం తన వంతు అహర్నిశలు కృషి చేస్తూ తనకు అప్పగించిన వార్డుల్లో అత్యధిక శాతం మెజార్టీ తీసుకురావడంలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. 2021 కార్పొరేషన్ ఎన్నికలలో వైసిపి నాయకులు శాంతమ్మ ను కార్పొరేటర్ గా పోటీ చేయకుండా ఎన్నో అడ్డంకులు సృష్టించారు. వాటన్నిటికీ తట్టుకొని కార్పొరేటర్ గా పోటీ చేసి తక్కువ ఓటర్లు తక్కువ ఓట్లతో ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ ఏమాత్రం నిరుత్సాహపడకుండా బ్యాంకు శాంతమ్మ ప్రజల్లో ఉంటూ ఎవరు ఏ సహాయం కావాలని కోరిన వెంటనే వారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ వారి మన్ననలను పొందారు. తెలుగుదేశం పార్టీలో టిడిపి నగర మహిళా అధ్యక్షురాలుగా ఆమె చేస్తున్న సేవలను అధిష్టానం గుర్తించి తిరిగి 56వ డివిజన్ కార్పొరేటర్ గా అవకాశం కల్పించడంతో ఆమె ఏకగ్రీవం అయ్యారు. ఆమెను పలువురు తెలుగుదేశం, జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు కలిసి అభినందనలు తెలిపి శాలువ