35వ వార్డు అభివృద్ధే నా సంకల్పం : ఎస్.రేణుక వెల్లడి
మదనపల్లె,మేజర్ న్యూస్ : 35వ వార్డు సొసైటీ కాలనీ అభివృద్ధి,ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని కౌన్సిలర్ అభ్యర్థిని ఎస్.రేణుక తెలిపారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 35వ వార్డు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతూ,వార్డు ప్రజల ఆదరాభిమానాలు, ఆశీస్సులు అందించాలని కోరారు.వార్డులో మౌలిక సదుపాయాల కల్పన,పారిశుధ్యం మెరుగుదల,తాగునీటి సమస్యల పరిష్కారం,వీధుల్లో నెలకొన్న సమస్యల నివారణకు ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు.ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ,వారి ఆశలు,ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడమే తన సంకల్పమని తెలిపారు.మన వార్డు అభివృద్ధి - మనందరి బాధ్యత అనే నినాదంతో ప్రజల మద్దతు కోరుతున్నారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి