334 మంది అంగన్వాడీ కార్యకర్తలకు యూనిఫాం పంపిణీ చేసినడాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.
సూర్య న్యూస్ దర్శి. అంగన్వాడీ కార్యకర్తలలో ఏకరూపత దుస్తులతో ఆలోచన విధానంలో ఏకత్వం ఉంటుందని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. దర్శి లోని టిడిపి కార్యాలయం నందు అంగన్వాడీ కార్యకర్తలకు కొత్త యూనిఫామ్స్ ను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అందజేశారు. దర్శి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని 334 మంది అంగన్వాడీ టీచర్లకు యూనిఫాం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ పరిమళ , సూపర్‌వైజర్ అనురాధ , దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగమణి - సుబ్బారావు, దర్శి పట్టణ టిడిపి అధ్యక్షులు పుల్లలచెరువు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు