28న నవోదయ ప్రవేశ పరీక్ష
మర్రిపాడు మేజర్ న్యూస్ : జిల్లాలోని మర్రిపాడు మండలం కృష్ణాపురం జవహర్ నవోదయ విద్యాలయంలో 2027- 28 విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతిలో ప్రవేశం పొందుటకు ఈనెల 28వ తేదీ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆ విద్యాలయ ఇన్చార్జి ప్రిన్సిపల్ జి చన్నయ్య మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించి జిల్లాలో మొత్తం 17 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లవ్యాప్తంగా 3,054 మంది విద్యార్థినీ, విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు.
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరూ ఇప్పటికే తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు. ఇంకా ఎవరికైనా హాల్ టికెట్లు అందుబాటులో లేకపోతే, వారు నేరుగా జవహర్ నవోదయ విద్యాలయం, కృష్ణాపురం, నెల్లూరు జిల్లాకు వచ్చి హాల్ టికెట్లు పొందవచ్చని తెలిపారు. పరీక్షకు సంబంధించిన ఇతర వివరాల కోసం 89850 07528 నంబర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.