BREAKING
ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధికి బాటలు వేస్తా భారత్‌–అమెరికా సంబంధాలకు ప్రజాస్వామ్య సంస్థలే బలమైన పునాది: లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఇటలీ అంతర్జాల దాడులకు బాధ్యులెవరో స్వతంత్రంగా నిర్ధారించాల్సి ఉంది.. సాంకేతిక దర్యాప్తులో కీలక అంశాలు! ఏపీలో 601 ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు పూర్తి.. ఒకే రోజు థియేటర్లలో మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు! పొన్నూరు 37వ వార్డులో జోరందుకున్న వైసీపీ ఎన్నికల ప్రచారం ప్రచారంలో పాల్గొన్న వైసీపీ చైర్మన్ అభ్యర్థి షేక్ నాజిని సిద్ధిపేట.. ఇక కాంగ్రెస్ అడ్డా.. బ్యాచులర్ పార్టీ డ్యూక్స్ రివ్యూ.. 14 ఏళ్ల తర్వాత అమల్ నీరద్ స్టైలిష్ యాక్షన్ ఎలా ఉందంటే? అన్నారంలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ రుద్ర సహిత కాలబైరవ మహా యజ్ఞంకు విస్తృత ఏర్పాట్లు ఓం సినిమాకు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్.. తెలుగు వెర్షన్‌కే అగ్రస్థానం! శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం శరీరానికి ఉపవాసం..మనసుకు నామస్మరణ.. ఆత్మకు ఆధ్యాత్మిక చింతన..అనుగ్రహించేదే.. మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం హెయిల్ మేరీ నుంచి మారివిల్ చిరకే వీడియో సాంగ్ విడుదల.. సూరజ్ వెంజారమూడు భావోద్వేగ నటన!

పేద విద్యార్థిని లండన్ చదువుకు ఆసరా..పెద్ద మనసు చాటుకున్న ఎంపీ

Select Suryaa Now
పేద విద్యార్థిని లండన్ చదువుకు ఆసరా..పెద్ద మనసు చాటుకున్న ఎంపీ

అమలాపురం మేజర్ న్యూస్ : అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన ఓ పేద ముస్లిం మైనార్టీ విద్యార్థిని ఉన్నత చదువుల కోసం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ పెద్ద మనసు చాటుకున్నారు. లండన్‌లో ఎంబీఏ చదువుకోవాలన్న ఆ విద్యార్థిని కలకు తన ఆర్థిక సాయంతో రెక్కలు తొడిగి అండగా నిలిచారు. ఎంపీ ఉదార స్వభావం పట్ల కోనసీమ ముస్లిం మైనార్టీ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.వివరాల్లోకి వెళితే... అమలాపురానికి చెందిన మహమ్మద్ రెహనా అనే విద్యార్థిని లండన్‌లో ఎంబీఏ చదవాలని భావించింది. అయితే ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూసింది. ఇటీవల రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన సానా సతీష్.. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు ఆహ్వానం మేరకు కోనసీమ విచ్చేశారు. ఈ సందర్భంగా టీడీపీ బూత్ కన్వీనర్ వెంకటేశ్వరరావు ద్వారా రెహనా తన పరిస్థితిని వివరిస్తూ ఎంపీకి వినతిపత్రం అందజేసింది.విద్యార్థిని విజ్ఞప్తిపై ఎంపీ సానా సతీష్ తక్షణమే స్పందించారు. ఉన్నత చదువుల పట్ల ఆమెకున్న ఆసక్తిని గమనించి పూర్తి అండదండలు అందించారు. రెహనా ఎంబీఏ చదువుకు అయ్యే ఖర్చుతో పాటు, లండన్ వెళ్లేందుకు అవసరమైన ప్రయాణ ఖర్చులన్నీ తానే భరించి ఆమెను విదేశాలకు పంపారు.సకాలంలో స్పందించి పేద విద్యార్థిని జీవితంలో వెలుగులు నింపిన ఎంపీ సానా సతీష్‌కు కోనసీమ ముస్లిం మైనార్టీ నాయకులు, పెద్దలు ఘనంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంపీకి కృతజ్ఞతలు తెలిపిన వారిలో స్టేట్ వక్ఫ్ బోర్డ్ సభ్యులు హాజీ ముఖరం హుస్సేన్, ప్రముఖ న్యాయవాది మహమ్మద్ అజమ్, ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ అధ్యక్షులు మహమ్మద్ బషీర్, టీడీపీ ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ మిరాన్ షరీఫ్, జనసేన నాయకులు మహమ్మద్ మహబూబ్ షరీఫ్, ఖాదర్ వలీ తదితరులు ఉన్నారు.రంబాల 

సత్యనారాయణ మేజర్ న్యూస్ అమలాపురం