|
|
by Suryaa Desk | Tue, Mar 17, 2026, 03:38 PM
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద రైతులకు ఏడాదికి రెండు విడతలుగా రూ.12,000 అందిస్తారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన, 18 ఏళ్లు నిండిన, సొంత వ్యవసాయ భూమి ఉన్న రైతులు అర్హులు. ధరణి పోర్టల్‌లో భూమి నమోదై ఉండాలి. సాగుకు యోగ్యం కాని భూములు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రజాప్రతినిధులు, దేవాలయాలు, ట్రస్టుల పేరు మీద ఉన్న భూములు ఈ పథకానికి అనర్హులు. కొత్త రైతులు మాత్రమే మండల వ్యవసాయ కార్యాలయం, గ్రామ పంచాయతీలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా జిరాక్స్ కాపీలు అవసరం.