|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 02:58 PM
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో జీవనోపాధి పొందుతున్న భారతీయులు, అందునా తెలంగాణ వాసులు ప్రస్తుత పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు గుర్తుచేశారు. యుద్ధం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, దీనివల్ల పేద, మధ్యతరగతి ప్రజల పరిస్థితి దయనీయంగా మారుతోందని పేర్కొన్నారు. కేవలం అంతర్జాతీయ పరిస్థితులే కాకుండా, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఆయన ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు.ముస్లిం సమాజానికి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని హరీశ్‌రావు మండిపడ్డారు. ఇమామ్‌లు, మౌజన్‌లకు అందాల్సిన నెలసరి భత్యాలను ప్రభుత్వం చెల్లించకుండా ఎగ్గొడుతోందని ఆరోపించారు.