|
|
by Suryaa Desk | Tue, Mar 17, 2026, 12:04 PM
హైదరాబాద్ కూకట్ పల్లి పీఎస్ పరిధిలో హవాలా డబ్బు కలకలం రేగింది. డబ్బులు తీసుకుపోతున్న వారి కళ్ళలో కారంకొట్టి కోటి రూపాయలు కొట్టేసిన దుండగులు. బహదూర్ పూర నుండి జీడిమెట్లకు హవాలా డబ్బు బైక్ పై తీసుకెళ్తున్న అజాముద్దీన్ , కుస్రుఫ్ కళ్ళలో కారం కొట్టి డబ్బులు ఎత్తుకెళ్లిన దుండగులు, ఎటుపోయారో అయోమయంలో పడ్డారు. దీనితో పోలీసులను ఆశ్రయించిన బాధితులు ఫిర్యాదుతో పోలీసులు దుండగుల కోసం గాలింపు మొదలు పెట్టారు. కూకట్ పల్లి , బాలానగర్ పోలీసులు ఒక టీమ్ గా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హవాలా డబ్బుని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న గోకుల్ ఎంక్లేవ్ లో తీసుకుని వెళ్తున్న క్రమంలో ఏసిపి ఆఫీస్ సమీపంలోని పిల్లర్ నెంబర్ 825 వద్ద ఈ దోపిడీ జరిగింది. ఇదిలా ఉండగా, డబ్బులు తీసుకుని వెళ్తున్న వారినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి వద్ద ఉన్న భారీ మొత్తంలో నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ అవసరానికి తీసుకెళ్తున్నారు అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.. ఇబ్రహీం అనే అనుమానితుడిని సైతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.