|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 03:46 PM
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఊట్పల్లి గ్రామంలో వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఎస్టీ కమ్యూనిటీ హాల్ వద్ద శనివారం సింగిల్ ఫేజ్ మోటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ మోటర్ ద్వారా సమీప ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా ఎస్టీ కాలనీ ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి వేసవిలో నీటి కొరత సమస్యను దృష్టిలో పెట్టుకొని ఈ మోటర్‌ను ఏర్పాటు చేసినట్లు గ్రామ ప్రతినిధులు తెలిపారు. గ్రామస్థులు ఈ చర్యను స్వాగతిస్తూ, వేసవిలో నీటి సమస్య కొంతవరకు తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రశాంతి తిరుమలేష్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువ నాయకులు పాల్గొన్నారు.