|
|
by Suryaa Desk | Mon, Mar 16, 2026, 03:13 PM
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్‌లోని రాంబాగ్ సర్వే నంబరు 354/1, 354/2, 354/3లలో 2.34 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ. 250 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. చుట్టూ దేవాలయాలు.. మధ్యలో ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమికి ఆనుకుని సిక్కులకు సంబంధించిన సమాధి ఉంది. ఒక వైపు దేవాలయాలకు కేటాయించాలని.. మరో వర్గం సిక్కులకు ఇవ్వాలని స్థానికంగా ఎప్పటి నుంచో వివాదం నెలకొని ఉంది. ఎవరికి వారు తమదంటూ వాధిస్తూ వచ్చారు. ఇటీవల సిక్కులు తమకు ఈ భూమిని కేటాయించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ స్థలం విషయంపై సరైన నిర్ణయం తీసుకోవాలని జనవరి నెల 29న జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఇందుకు గాను 3 నెలల సమయం ఇచ్చింది. ఈ లోగా సిక్కు మతస్తులు 2.34 ఎకరాల చుట్టూ టిన్ షీట్లతో ప్రహరీ నిర్మించి వారి ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో వివాదం తలెత్తింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.