|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 10:33 AM
జలమండలి ఓ అండ్ ఎం డివిజన్ నం-21 పరిధిలో గత రెండు నెలలుగా మాధాపూర్ సర్కిల్, చందర్ నాయక్ తండా.. పరిసర ప్రాంతాలలో సీవరేజ్ ఓవర్ ఫ్లో ను అధికారులు అరికట్టారు. వివరాలలోకి వెళ్తే.. చందర్ నాయక్ తండా.. పరిసర ప్రాంతాలలో ప్రధాన సీవరేజ్ పైపులో ఏర్పడిన తీవ్ర చోకేజి కారణంగా మురుగు నీరు వెనక్కి రావడం (బ్యాక్ ఫ్లో).. రోడ్లపైకి మురుగు ప్రవహించడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. దీనిపై సోషల్ మీడియా, జలమండలి మెట్రో కస్టమర్ కేర్ కు, స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి అనేక ఫిర్యాదులు అందాయి.ఈ సమస్యను పరిష్కరించేందుకు మాధాపూర్ సర్కిల్ బృందం గత మూడు రోజులుగా నిరంతరం శ్రమించి, హై ప్రెషర్ జెట్టింగ్ మెషిన్, టెలిస్కోపిక్ హైడ్రాలిక్ గ్రాబర్ యంత్రాలతో సహాయంతో ప్రధాన సీవరేజ్ పైపులో ఏర్పడిన సిల్ట్ ను బయటికి తీసి మురుగు నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేశారు. ఇలా నగరంలో చాల ప్రాంతాల్లో తరుచూ సీవరేజ్ ఓవర్ ఫ్లో ఫిర్యాదులు నమోదు కావడంతో అధికారులు డీ- సిల్టింగ్ పను చేపడుతున్నారు.. అయితే మ్యాన్ హోళ్లలో నుంచి బ్లాంకెట్లు.. బెడ్ షీట్లు, బట్టలు, ప్లాస్టిక్ వస్తువులు ఇతర ఘన పదార్థాలను వెలికితీస్తున్నారు. ఆ కారణంగా ఆ ప్రాంతంలో సీవరేజ్ ఓవర్ ఫ్లో అవుతున్నట్టు గుర్తించి.. వాస్తవానికి స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఇక్కడ డీ-సిల్టింగ్ పనులు నిర్వహించి సిల్ట్ అంతా తొలగించినా, కానీ మళ్లీ అందులో వ్యర్థాలు వేయడం వల్ల అది పేరుకుపోయి మళ్లీ ఓవర్ ఫ్లో కావడం సర్వసాధారణం అయింది.
ప్రజల అవగాహన లేమితో ఇలా చేయడం వల్ల సమస్య మళ్లీ ఉత్పన్నమయింది. జనాల్లో అవగాహన, వారి నుంచి సరైన సహకారం లేకుంటే ఇలాంటి స్పెషల్ డ్రైవ్ లు ఎన్ని చేపట్టినా సమస్యలు వస్తూనే ఉంటాయి. జలమండలి చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో సీవరేజ్ పైపు లైన్లు, మ్యాన్ హోళ్లలో డీ-సిల్టింగ్ పనులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మ్యాన్ హోళ్ల నుంచి భారీగా వ్యర్థాలను (సిల్ట్) బయటికి తీశారు. ఎన్నో రోజుల నుంచి ఈ వ్యర్థాలు పేరుకుపోయాయి. దీంతో ఇవి మురుగు నీటి ప్రవాహానికి అడ్డుగా మారి మ్యాన్ హోళ్లు పొంగిపోతున్నాయి.ప్రజలు మ్యాన్ హోళ్లలో బ్లాంకెట్లు, బేడీషీట్లు, ప్లాస్టిక్ వస్తువులు, కవర్లు, వాటర్ బాటిళ్లు, ఘన పదార్థాలు లాంటి వ్యర్థాలు వేస్తున్నారు. ఒకానొక దశలో అయితే మ్యాన్ హోళ్ల నుంచి దిండ్లు, పరుపులు తీసిన ఘటనలూ ఉన్నాయి. ఇవన్నీ వేయడం వల్ల అందులో ప్రవహించే మురుగు నీరుకు ఆటంకం ఏర్పడుతుంది. అది సాఫీగా లేకపోవడంతో మ్యాన్ హోల్ మూతల నుంచి బయటికి వచ్చి ఓవర్ ఫ్లో అవుతుంది. ప్రజల అవగాహన లేమితో ఇలా చేయడం వల్ల ఓవర్ ఫ్లో సమస్యలు వస్తున్నాయి. అదే పౌరుల నుంచి సరైన భాగస్వామ్యం ఉంటే, ఓవర్ ఫ్లో సమస్యలు తగ్గుతాయి.ఇదే కాకుండా.. హోటళ్లు, కార్యాలయాలు, బేకరీలు, ఫుడ్ కోర్టులు, వాణిజ్య భవనాల యజమానులు, బహుళ అంతస్తు భవన సముదాయాల నిర్వాహకులు.. తమ సీవరేజ్ పైపు లైన్ ను నేరుగా జలమండలి సీవరేజ్ నెట్ వర్క్ కు అనుసంధానం చేయడంతో వాటి నుంచి వచ్చే ఆహార, వ్యర్థ పదార్థాలు మ్యాన్ హోళ్లలో చేరుతున్నాయి. సిల్ట్ ఛాంబర్లు నిర్మించుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఫలితంగా సీవరేజ్ పైపు లైన్లపై ఒత్తిడి పెరిగి అవి ఓవర్ ఫ్లో అవుతున్నాయి.
పైన పేర్కొన్న వారంతా తమ ప్రాంతాల్లో సిల్ట్ ఛాంబర్లు ఏర్పాటు చేసుకుంటే.. ఘన వ్యర్థాలు అందులోనే ఆగి మ్యాన్ హోళ్లలోకి మురుగు నీరు మాత్రమే ప్రవహిస్తుంది. తద్వారా వాటిలో నుంచి వచ్చే వ్యర్థాలు మ్యాన్ హోళ్లలో కలవకుండా ఉంటాయి. ఫలితంగా మ్యాన్ హోళ్లలో మురుగు ప్రవాహం సాఫీగా సాగి, ఓవర్ ఫ్లో వంటి సమస్యలు తలెత్తవు. వారంతా సిల్ట్ ఛాంబర్లు నిర్మించుకోవాలని జలమండలి విజ్ఞప్తి చేస్తోంది.ప్రజలు బాధ్యతగా వ్యవహరించి మాన్ హోల్ లలో చెత్త వేయకుండా సహకరించాలి. ప్రజలే సహకరించకపోతే హైదరాబాద్ నగరాన్ని ఎవరు కాపాడతారు…?మన మహా నగరం మనందరిది.. కానీ కొంతమంది నిర్లక్ష్యంగా మాన్ హోల్ లలో చెత్త, ప్లాస్టిక్, నిర్మాణ అవశేషాలు వంటి ఘన వ్యర్థాలను వేస్తున్నారు. జలమండలి సిబ్బంది రాత్రింబవళ్ళు శ్రమించి ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజల సహకారం లేకుండా నగరాన్ని శుభ్రంగా ఉంచడం సాధ్యం కాదు.