|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 12:22 PM
మిత్రధర్మం పాటించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే ధోరణి కొనసాగితే పొత్తును తెంచుకోవడానికి సైతం వెనుకాడబోమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. హైదరాబాద్‌లో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొత్తగూడెం ఉదంతంతో ఇరు పార్టీల మధ్య దూరం పెరిగిందని, ఈ అంశంపై ముఖ్యమంత్రితోనే తేల్చుకుంటామని ఆయన ప్రకటించారు.మార్చి 24న 'చలో అసెంబ్లీ' కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ప్రధానంగా రెండు విడతలుగా పెండింగ్‌లో ఉన్న రైతుబంధు నిధులను వెంటనే వేయాలి.అలానేహైదరాబాద్, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.రాజకీయ జోక్యంతో సింగరేణిని నష్టాల్లోకి నెడుతున్నారని, దీనిపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్.