|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 12:20 PM
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి వెలుగుమట్ల బాధితులకు హామీ వచ్చిన నేపథ్యంలో ఆమె తన దీక్షను విరమించారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప జేశారు. కాగా వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కవిత ఖమ్మంలో సోమవారం రాత్రి నిరవధిక దీక్షను చేపట్టారు. పోలీసులు ఆమెను అడ్డుకుని హైదరాబాద్‌కు తరలించగా, నగరంలో ఆమె దీక్షను కొనసాగించారు.వెలుగుమట్ల భూదాన్ భూమిలో అర్హులకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పేదలకు అందించి న్యాయం చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క హామీ ఇచ్చారు. 412 మందిని అధికారికంగా గుర్తించి, పట్టాలు ఇచ్చి న్యాయం చేస్తున్నామని అన్నారు. పట్టాలు పొందిన వారు రేపటి నుంచి తమ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని కూడా ధైర్యం చెప్పారు.