|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 03:20 PM
రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా నేడు (బుధవారం) ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈయన తెలంగాణకు నాల్గవ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు. వీరితో పాటు హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ బి.శివధర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.