|
|
by Suryaa Desk | Sun, Mar 15, 2026, 02:09 PM
పటాన్చెరు జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్. పటాన్చెరు మరియు జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ఎమ్మెల్యే శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు పటాన్చెరువు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది.ఈ సందర్భంగా జెపి కాలనీ డివిజన్ పరిధిలో నందన్ ప్యారడైజ్ కాలనీలో మంజీర త్రాగు నీటిని ప్రారంభించడం జరిగింది.
- చైతన్య నగర్ కాలనీలో రెండు కోట్ల రూపాయల నిధులతో నూతన SC కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది .
-జెపి కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీలో 6.50 లక్షల నిధులతో నిర్మించనున్న GHMC పార్కు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.
పటాన్చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో 6.50 లక్షల నిధులతో నిర్మించనున్న GHMC పార్కు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.
- అనంతరం పటాన్చెరు డివిజన్ పరిధిలోని సరాయి మసీదు వద్ద రంజాన్ మాసం సందర్భంగా ఈద్ కానుకలను పంపిణీ చేయడం జరిగింది. - జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని చిన్న మసీదు వద్ద రంజాన్ మాసం సందర్భంగా ఈద్ కానుకలను పంపిణీ చేయడం జరిగింది.-పటాన్చెరు డివిజన్ పరిధిలోని మార్కెట్ వద్ద గల జామా మసీదు వద్ద రంజాన్ మాసం సందర్భంగా ఈద్ కానుకలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, స్థానిక ప్రజలు,ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.