|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 05:15 PM
మనకి ఏదైనా ఒక ప్రింట్ కావాలంటే ఏం చేస్తాం.. ఏ జెరాక్స్ సెంటర్‌కో వెళతాం. ఓ ఐదు రూపాయలు ఇస్తే ప్రింట్ తీసి మన చేతికి ఇస్తారు. ఒకవేళ షాపు అందుబాటులో లేకపోతే ఇబ్బంది తప్పదు. అయితే ఇప్పుడు సరికొత్తగా ప్రింట్ ఈజీగా తీసుకునేందుకు కియోస్క్ మిషన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఏటీఎంలా రోడ్డు పక్కన వీటిని ఏర్పాటు చేస్తారు.. చక్కగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనమే ప్రింట్‌లు తీసుకునే సదుపాయం కల్పిస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తున్నారు. ఈజీగా ప్రింట్ చేసుకునేందుకు మెషిన్ ఏర్పాటు చేశారు.
హైదరాద్‌లోని కూకట్‌పల్లిలో ఫోన్ ద్వారా స్కాన్ చేసి ఈజీగా ప్రింట్లు తీసుకునే కియోస్క్ మెషిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఓ ఇద్దరు యువకులు ఈ కియోస్క్ మెషిన్‌ను చెన్నైలో కొనుగోలు చేసి క్విక్ ప్రింట్ పేరుతో కూకట్‌పల్లి మెట్రోస్టేషన్ దగ్గర ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఈజీగా ప్రింట్ తీసుకోవచ్చు. ముందుగా ఈ కియోస్క్ మెషిన్‌పై ఉన్న ‘క్యూఆర్’ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఫైల్ అప్‌లోడ్ అనే ఆప్షన్ వస్తుంది.. వెంటనే ఫోన్‌లో ఉన్న ఫైల్‌ను అప్‌లోడ్ చేయాలి.
అప్పుడు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి.. కలర్ ప్రింట్ కావాలా, బ్లాక్‌అండ్‌వైట్ కావాలా, ఎన్ని ప్రింట్లు కావాలి అని అడుగుతుంది. ఆ ఆప్షన్స్ సెలక్ట్ చేసి టిక్ పెట్టగానే యూపీఐ పేమెంట్ ఆప్షన్ వస్తుంది. అక్కడ ఎంత డబ్బు చెల్లించాలో ఉంటుంది. యూపీఐ పేమెంట్ ద్వారా డబ్బు చెల్లించిన తర్వాత మనం ఇచ్చిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయగానే మెషిన్ నుంచి వరుసగా ప్రింట్లు వచ్చేస్తాయి. ఈ సరికొత్త మెషిన్ గురించి సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. జెరాక్స్ షాపులకు వెళ్లకుండా ఈజీగా ప్రింట్ తీసుకోవచ్చు. మొత్తానికి హైదరాబాద్‌లో ఉండేవారికి క్విక్ ప్రింట్ సాయంతో ఈజీగా ప్రింట్ తీసుకునే అవకాశం దక్కింది. కొంతమంది ఈ క్విక్ ప్రింట్ గురించి సోషల్ మీడియాలో వీడియోలు కూడా చేశారు.