|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 12:05 PM
మెదక్ ఎంపీ రఘునందన్ రావు, సిర్పూర్(టి) ఎమ్మెల్యే హరీశ్ బాబు ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి, హైదరాబాద్-నాగ్‌పూర్, బెల్లంపల్లి-గడ్చిరోలి గ్రీన్‌ఫీల్డ్ రహదారుల పనులను వేగవంతం చేయాలని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, హైదరాబాద్-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే అలైన్‌మెంట్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ ప్రాజెక్టులపై ముందడుగు పడుతుందని భరోసా ఇచ్చారు.మానుకోట ఎంపీ పోరిక బలరాంనాయక్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియోజకవర్గ పరిధిలోని పలు జాతీయ రహదారుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా మహబూబాబాద్ పట్టణ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్, డోర్నకల్ ఔటర్ రింగ్ రోడ్, పార్లమెంట్ పరిధిలోని కొత్త రోడ్ల ప్రతిపాదనలు, పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారులకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ బలరాంనాయక్ కోరారు. ఎంపీ వెంట నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఉన్నారు.