|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 01:21 PM
రాష్ట్రంలో కొత్త డీజీపీ ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది అనే చెప్పాలి. తాజాగా ఢిల్లీలో జరిగిన యూపీఎస్సీ ఉన్నత స్థాయి కమిటీ భేటీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడిన ప్యానల్‌ను ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం .వీరిలో ప్రముఖంగా ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్ , సీనియారిటీలో అందరికంటే ముందున్నారు. మే 2028 వరకు ఆయనకు సర్వీస్ కాలం ఉంది. ప్రస్తుతం సెంట్రల్ డిప్యుటేషన్‌లో ఐబీ జాయింట్ డైరెక్టర్‌గా విధుల్లో ఉన్న వినాయక్ ప్రభాకర్ ఆప్టే, అలానే ప్రస్తుతం హోమ్ గార్డ్స్ అండ్ ట్రైనింగ్ విభాగంలో డీజీగా సేవలు అందిస్తున్న డాక్టర్ సౌమ్య మిశ్రా ఉన్నారు. ఈ తరుణంలో ఎవరికీ అవకాశం దక్కుతుందో చూడాలి.