|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 03:40 PM
హైదరాబాద్ నగరంలోని చందానగర్‌లో ప్రధాన రహదారిపై ఉన్న ప్రముఖ 'అను ఫర్నిచర్' షోరూంలో గురువారం అర్ధరాత్రి మంటలు చెలరేగి, ఐదు అంతస్తుల్లోని ఫర్నిచర్ మొత్తం కాలి బూడిదైంది. ఈ ఘటనలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.అర్ధరాత్రి సమయంలో షోరూం నుంచి మంటలు రావడం గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారమిచ్చారు. షోరూంలో చెక్క, కుషన్లు వంటి తేలికగా మండే వస్తువులు అధికంగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. చూస్తుండగానే ఐదు అంతస్తుల భవనం మొత్తం అగ్నికీలల్లో చిక్కుకుంది. దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. అయితే, అప్పటికే షోరూంలోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది.