|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 11:36 AM
హైదరాబాద్: చందానగర్‌లో భారీ అగ్నిప్రమాదం.జాతీయ రహదారి పక్కనే ఉన్న అను ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.భారీగా ఎగసిపడుతున్న మంటలు.మంటల్లో కాలి బూడిదైన ఐదు అంతస్థుల బిల్డింగ్షా. ఫర్నిచర్ మొత్తం దగ్ధం.పక్కనే నిర్మాణం జరుగుతున్న బిల్డింగ్‌లలోకి కూడా వ్యాపించిన మంటలు.నాలుగు ఫైర్ ఇంజన్‌లతో మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక అధికారులు.దుకాణం ఐదు అంతస్తుల భవనంలో ఉండటం, లోపల సోఫాలు, బెడ్‌లు, టేబుల్స్ తదితరాలు ఉండడం వల్ల మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్, గ్యాస్ లీకేజీ లేదా ఇతర కారణాలు ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక అధికారులు సంయుక్తంగా ఘటన స్థలంలో దర్యాప్తు చేస్తున్నారు.ఈ ప్రమాదం కారణంగా చందానగర్ ప్రాంతంలో కొంత వరకూ సేవలకు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.