|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 06:44 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన కొందరు రైతులు ముస్తాబాద్ మండలం పోతుగల్ సొసైటీలో బుధవారం ఉదయం ఫర్టిలైజర్ యాప్ లో యూరియా బుక్ చేసుకున్నారు. యూరియా బుక్ చేసుకున్న రైతులు పోతుగల్ కు వెళ్తే ఇక్కడ లేదని ఆవునూరు గూడెం వెళ్లాలని చెప్పడంతో గూడెం సొసైటీ కి వెళ్లడంతో మా గ్రామానికి కాదని గంభీరావుపేట మండలానికి చెందిన రైతులకు యూరియా ఎలా ఇస్తారని రైతులు తీసుకున్న యూరియా బస్తాలపై పెట్రోల్ పోశారు.మా మండల రైతులకు కాదని ఇతర మండల రైతులకు యూరియా ఎలా ఇస్తారని రైతుల వాగ్వాదం. నిప్పంటిస్తామని వాగ్వివాదానికి దిగారు సుమారు గంటపాటు రైతుల ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను శాంతింప చేసి బుక్ చేసుకున్న రైతులకు యూరియా అందించారు.యాప్ లో కాకుండా యూరియా నేరుగా రైతులకు ఇవ్వాలని కోరుకుంటున్న రైతులు.