|
|
by Suryaa Desk | Mon, Mar 16, 2026, 12:39 PM
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు శుభకార్యాల్లో బీఆర్ఎస్ నాయకుడు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ శ్రీ మాద్రి పృథ్వీరాజ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన వివాహ వేడుకలు, గృహప్రవేశాలు, పుట్టు పంచలు, భూమి పూజ కార్యక్రమాలు మరియు ఇతర శుభకార్యాలకు హాజరై కుటుంబ సభ్యులను ఆప్యాయంగా కలుసుకున్నారు.నూతన దాంపత్య జీవితం ప్రారంభిస్తున్న దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, గృహప్రవేశం చేసిన కుటుంబాలకు అభినందనలు తెలిపారు. అలాగే చిన్నారుల పుట్టు పంచల కార్యక్రమాల్లో పాల్గొని కుటుంబ సభ్యుల ఆనందంలో భాగస్వాములయ్యారు.ఈ సందర్భంగా శ్రీ మాద్రి పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ, ప్రజలతో సన్నిహితంగా మమేకమై వారి సంతోషాల్లో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రజల ప్రేమాభిమానాలే తనకు మరింతగా ప్రజాసేవ చేయడానికి ప్రేరణనిస్తాయని పేర్కొన్నారు.