|
|
by Suryaa Desk | Sun, Mar 15, 2026, 02:51 PM
పటాన్చెరు :పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ముస్లిం మైనార్టీల సంక్షేమానికి, ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రంజాన్ పర్వదినం పురస్కరించుకొని..ఆదివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని వివిధ మసీదుల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం అందించిన రంజాన్ కానుకలను ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ముస్లింల ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేశారని తెలిపారు. రంజాన్ పండుగ రోజున నిరుపేద ముస్లింలు ఆనందోత్సాహాల మధ్య పండుగను నిర్వహించుకోవాలన్న లక్ష్యంతోనే కెసిఆర్ ప్రభుత్వం రంజాన్ కానుకల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.