|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 03:13 PM
ఇవాళ ఉదయం నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వినియోగదారులు తమ డైరెక్ట్ మెసేజ్‌లు (డీఎంలు) యాక్సెస్ చేయలేకపోతున్నామని, ఫిర్యాదులు చేస్తున్నారు. సెర్చ్ టూల్ కూడా పనిచేయడం లేదని, కాంటాక్ట్స్ కనిపించడం లేదని ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా నెటిజన్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అంతరాయాలను ట్రాక్ చేసే వెబ్‌సైట్ డౌన్‌డిటెక్టర్ ప్రకారం బుధవారం ఉదయం నాటికి 10,000కు పైగా ఫిర్యాదులు నమోదు కాగా ఇందులో అమెరికా నుంచే అధికంగా ఫిర్యాదులు నమోదయ్యాయి.డౌన్‌డిటెక్టర్‌కు అందిన మొత్తం ఫిర్యాదుల్లో 71 శాతం యాప్ యాక్సెస్‌కు సంబంధించినవి కాగా, 19 శాతం సర్వర్ కనెక్షన్‌కు, 5 శాతం ఫీడ్ లేదా టైమ్‌లైన్‌కు సంబంధించిన సమస్యలని వెల్లడైంది. ఈ అంతరాయంపై ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యం ఇంకా అధికారికంగా స్పందించలేదు.