|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 07:19 PM
పటాన్‌చెరులోని మైత్రి గ్రౌండ్‌లో నిర్వహించిన యూరో కిడ్స్ స్కూల్ కల్చరల్ ఫెస్టివల్ 2025–26 కార్యక్రమానికి మాద్రి పృథ్వీరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మాద్రి పృథ్వీరాజ్ మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో పిల్లలపై కేవలం చదువుపైనే ఒత్తిడి పెట్టకుండా, వారిలో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఆటలు, పాటలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా ప్రోత్సహించడం అవసరమని తల్లిదండ్రులకు సూచించారు.చిన్నారులను ప్రతిభావంతులుగా, సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో పాఠశాల యాజమాన్యం చేస్తున్న కృషిని మాద్రి పృథ్వీరాజ్ అభినందించారు.ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం మరియు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు