|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 01:15 PM
తెలంగాణ రాష్ట్రము, నిర్మల్ జిల్లాలో నేడు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా ఇచ్చోడ మండలం సోన్‌పల్లి గ్రామానికి చెందిన ఒక కుటుంబం బంధువులతో కలిసి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరగనున్న వివాహ వేడుకకు హాజరయ్యేందుకు డీసీఎం వ్యాన్ లో బయలుదేరారు. వ్యాన్ కొండాపూర్ బైపాస్ సమీపానికి చేరుకోగానే టైరు పేలిపోవడంతో వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీనితో వ్యాన్ రోడ్డుపై పల్టీలు కొట్టి పక్కకు పడిపోయింది. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 17 మంది ఉన్నట్లు సమాచారం.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.