|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 10:23 AM
హైదర్‌గూడ ప్రాంతానికి చెందిన అయ్యప్ప భక్తులు 43 రోజుల మండల దీక్షను పూర్తిచేసి, ఇరుముడి కట్టుకుని రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ నుండి శబరిమలై యాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ పుణ్యయాత్రలో గురుస్వాములైన కొలన్ వరద రాజు రెడ్డి, సాబాధ విజయ్‌కుమార్, పెంటల సుధాకర్ రెడ్డి, కొలన్ జైరాజ్ రెడ్డి తో పాటు భక్తులు సులిగె దేవేందర్, లక్ష్మణ్ పాల్గొన్నారు. శబరిమలై శ్రీధర్మశాస్తా అయ్యప్ప స్వామి దర్శనం బ్రహ్మాండంగా జరగడంతో అందరూ హర్షోత్సాహాలతో నిండిపోయారు. కలియుగ ప్రత్యక్ష దైవం, సర్వాపరాధ రక్షకుడు అయిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం తమకు మహాభాగ్యం అన్న భావంతో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ యాత్ర డిసెంబర్ 5, 2025న ముగిసింది.