|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 02:20 PM
శబరిమల వెళ్ళే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను అందించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, తాజాగా మరో 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఇదివరకే 60 ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతుండగా, వాటికి అదనంగా ఈ కొత్త సర్వీసులను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు.ఈ ప్రత్యేక రైళ్లు డిసెంబర్ 19 నుంచి 31వ తేదీ మధ్య వివిధ తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.ఈ ప్రత్యేక రైళ్లలో కొన్నింటికి సంబంధించిన టికెట్ల బుకింగ్ డిసెంబర్ 3 (బుధవారం) ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని రైల్వే అధికారులు 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. సిర్పూర్ కాగజ్‌నగర్ - కొల్లం (07117), చర్లపల్లి - కొల్లం (07119, 07121), నాందేడ్ - కొల్లం (07123) రైళ్లకు ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ అదనపు సర్వీసుల వల్ల అయ్యప్ప భక్తుల ప్రయాణ భారం కొంతమేర తగ్గుతుందని భావిస్తున్నారు.