|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 11:09 AM
నగరంలో ఎలాంటి తాగునీరు, సీవరేజ్ ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ముందస్తు చర్యలు చేపట్టాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఉన్నతాధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. నెలవారీ నిర్వహించే ఈ మీటింగ్ లో పలు కీలక సూచనలు, ఆదేశాలిచ్చారు.నగరంలోని అన్ని ప్రధాన రహదారులపై ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా వాటర్ లీకేజీలు, సివరేజీ ఓవర్‌ఫ్లోలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అన్ని ముఖ్య ప్రాంతాల్లో మ్యాన్‌హోల్ మూతలు పరిశీలించి అవసరమైన చోట్ల మరమ్మత్తులు చేయించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే మ్యాన్ హోళ్ల నుంచి తీసిన వ్యర్థాలను (సిల్ట్) ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. ఎయిర్ టెక్ యంత్రాలు, సిల్ట్ కార్ట్ వాహనాలు అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఎంసీసీ పిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. కలుషితనీరు సమస్యలను పరిష్కరించడానికి ప్రాముఖ్యతనివ్వాలి సూచించారు. పగటి పూట ప్రధాన రహదారుల్లో ఏదైనా సమస్యలు పరిష్కరానికి చేపట్టే మరమ్మతులతో ట్రాఫిక్ ఆటంకం కాకుండా.. రాత్రిపూట పనులను చేపట్టాలని సూచించారు.