|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 04:05 PM
టెస్లా, స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని ఇటీవల బయటపెట్టారు. తన భాగస్వామి, న్యూరాలింక్ కంపెనీలో కీలక ఎగ్జిక్యూటివ్ అయిన శివోన్ జిలిస్‌కు భారతీయ మూలాలు ఉన్నాయని ఆయన తెలిపారు. "నా భాగస్వామి శివోన్ సగం భారతీయురాలు. ఆమెను చిన్నప్పుడే దత్తత తీసుకున్నారు. కెనడాలో పెరిగారు" అని ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు, తమ కుమారుల్లో ఒకరికి భారత సంతతికి చెందిన నోబెల్ గ్రహీత, ఖగోళ భౌతిక శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్‌కు గుర్తుగా "శేఖర్" అని పేరు పెట్టినట్లు మస్క్ వివరించారు. ఈ నేపథ్యంలో, అసలు ఎవరీ శివోన్ జిలిస్, ఆమె నేపథ్యం ఏంటి అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.