|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 12:05 PM
పోలీసు తనిఖీలకు చిక్కకుండా, ఎవరికీ అనుమానం రాకుండా మత్తుపదార్థాలు చేరవేసేందుకు నైజీరియన్లు కొత్త దారులు వెతుకుతున్నారు. ఉపాధి, ఉద్యోగవేటలో ఉన్న యువతులు, మహిళలను ఏజెంట్లుగా మార్చుకొని, వారి నిస్సహాయతను ఆసరా చేసుకొని సహజీవనం ముసుగులో డ్రగ్స్ స్మగ్లింగ్లో పావులుగా వాడుకుంటున్నారు. తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (ఈగిల్) బృందం ఢిల్లీలో అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ గుట్టును రట్టు చేసి, ఇద్దరు నైజీరియన్లతో సహా ఏడుగురిని అరెస్ట్ చేసింది. బంగ్లాదేశ్, నైజీరియా, ఈశాన్య రాష్ట్రాల యువతులతో సన్నిహితంగా మెలుగుతూ, దేశవ్యాప్తంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, పుణె, ముంబయి వంటి నగరాలకు కొకైన్, హెరాయిన్, ఎక్సటసీ పిల్స్, ఎండీఎంఏ వంటి సింథటిక్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు నిర్ధారించారు. నగరంలో విద్య, వైద్య వీసాలపై మకాం వేసిన కొందరు నైజీరియన్లు కూడా ఇదే తరహాలో సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు.