|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 05:33 AM
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించే బాధ్యతను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అప్పగించారు. సదస్సుకు ప్రధానమంత్రి సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు.ఢిల్లీ వెళుతున్న రేవంత్ రెడ్డి రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. తెలంగాణ రైజింగ్ 2025 సదస్సుకు ఆహ్వానం పలకనున్నారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులను కలిసి వారిని కూడా ఆహ్వానించనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులను ఆహ్వానించే బాధ్యతలను మంత్రులకు అప్పగించారు. రాష్ట్ర ఎంపీల బృందం ఢిల్లీ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు, గవర్నర్లను ఆహ్వానించనుంది.