|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 08:38 PM
న్యూ ఇయర్ అంటే సెలబ్రేషన్స్. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోయే సందర్భంలో, ప్రతి ఒక్కరు ఫుల్‌గా ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. డిసెంబర్ 31 సాయంత్రం నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాలు, సందడి జరుగుతుంది.రోడ్లపైకి వచ్చి పెద్ద హంగామా చేస్తారు, డీజే సౌండ్స్‌తో మ్యూజిక్‌ను ఆస్వాదిస్తారు. అంతేకాక, కొందరు మద్యం సేవిస్తూ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే, కేక్ కట్ చేసుకొని కొత్త సంవత్సరం కోసం స్వాగతం పలుస్తారు.కానీ, మీరు కూడా న్యూ ఇయర్ వేడుకను ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే, ప్రమాదాలు, షాంతి రక్షణ కోసం పోలీస్ పర్మిషన్ అవసరం అని అధికారులు హెచ్చరిస్తున్నారు.న్యూ ఇయర్ ఈవెంట్లకు సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు ముందస్తుగా పర్మిషన్ పొందాలని సూచిస్తున్నారు. 2026 న్యూ ఇయర్ ఈవెంట్లకు దరఖాస్తులు 21-12-2025 లోపు ఆన్లైన్లో సమర్పించాలి. దరఖాస్తులు cybpms.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.ఈ ఈవెంట్లకు కమర్షియల్ లేదా టికెటెడ్ ఫార్మాట్ ద్వారా పర్మిషన్ ఇవ్వబడుతుంది. 21వ తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిగణలోకి తీసుకోరని స్పష్టంగా పేర్కొన్నారు.