|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 11:19 AM
సీరియల్స్, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డ కో డైరెక్టర్, కెమెరామెన్, వారికి సహకరించిన బాలిక పెద్దమ్మ. హైదరాబాద్ – ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిదవ తరగతి చదువుతూ, తన పెద్దమ్మ వద్ద నివసిస్తున్న బాలిక(13). బాలిక పెద్దమ్మకు పరిచయస్తులుగా, ఆమె ఇంటికి తరచూ వస్తున్న నేపధ్యంలో, బాలికపై కన్నేసిన కడప జిల్లాకు చెందిన సినిమా కో డైరెక్టర్ బండి వెంకట శివారెడ్డి, కెమెరామెన్ పెనికెలపాటి అనిల్ అనే ఇద్దరు వ్యక్తులు. ఇదే విషయాన్ని వారు బాలిక పెద్దమ్మకు తెలపగా, వారిద్దరికి సినీ పరిశ్రమలో మంచి పలుకుబడి ఉందని వారితో చనువుగా ఉంటే మంచి అవకాశాలు వస్తాయని బాలికను నమ్మించిన ఆమె పెద్దమ్మ. పెద్దమ్మ మాటలు విని వారితో మాట్లాడుతున్న నేపధ్యంలో, పలుమార్లు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులు. జరిగిన విషయాన్ని బాలిక తన పాఠశాల ఉపాధ్యాయురాలికి తెలపగా, ఆమె ఫిర్యాదు మేరకు బాలిక పెద్దమ్మ, ఇద్దరు ఇండస్ట్రీ వ్యక్తుల మీద పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు