|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 02:04 PM
హైదరాబాద్ క్రీడా రంగంలో మరో కీలక మైలురాయిని అందుకోనుంది. దేశంలోనే మొట్టమొదటి మహిళా ఫుట్‌బాల్ అకాడమీని నగరంలో ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. హాంకాంగ్ తర్వాత ప్రపంచంలోనే ఇది రెండో అకాడమీ కావడం విశేషం. దీనితో పాటు దేశంలో రెండో పురుషుల ఫుట్‌బాల్ అకాడమీని కూడా తెలంగాణలోనే నెలకొల్పనున్నారు.ఈ నెల 8, 9 తేదీల్లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' వేదికగా ఈ అకాడమీల ఏర్పాటుపై అధికారిక ప్రకటన వెలువడనుంది. తెలంగాణ ప్రభుత్వం, ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్), ఫిఫా సంయుక్తంగా ఈ ప్రకటన చేయనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదే సదస్సులో హైదరాబాద్‌లో అంతర్జాతీయ చెస్ పోటీల నిర్వహణపై కూడా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.