|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 04:23 PM
దేశంలో పెద్దగా నియంత్రణ లేని గుట్కా, పాన్ మసాలా పరిశ్రమను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక చట్టాన్ని తీసుకురాబోతోంది. ‘హెల్త్ సెక్యూరిటీ టు నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్, 2025’ పేరుతో రూపొందించిన ఈ బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.ఈ కొత్త చట్టం ప్రకారం, గుట్కా, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులపై పన్ను విధించే విధానం పూర్తిగా మారనుంది. ఇప్పటివరకు తుది ఉత్పత్తి ఆధారంగా పన్ను విధిస్తుండగా, ఇకపై వాటి తయారీకి ఉపయోగించే యంత్రాల ఉత్పత్తి సామర్థ్యం ఆధారంగా ప్రత్యేక సెస్సు విధించనున్నారు. చేతితో తయారుచేసే యూనిట్లకు కూడా ప్రతినెలా తప్పనిసరిగా నిర్దిష్ట మొత్తంలో సెస్సు చెల్లించాల్సి ఉంటుంది.