|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 09:17 PM
హైదరాబాద్‌లోని హయత్ నగర్ శివగంగా కాలనీలో ప్రేమ్‌చంద్ అనే ఎనిమిదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చర్యలు తీసుకుంది. పలు పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన కమిషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ మరియు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 29వ తేదీ లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని కోరుతూ, ఘటనకు సంబంధించి బాలుడి ప్రస్తుత పరిస్థితి, కుక్కల స్టెరిలైజేషన్ మరియు నియంత్రణ చర్యల వివరాలను పేర్కొనమని సూచించింది.హైదరాబాద్‌లో జరిగిన ఈ దాడి ఘటనపై, ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో మాట్లాడి బాలుడి పరిస్థితి గురించి ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల దాడిలో గాయపడిన బాలుడికి మెరుగైన వైద్యం అందించమని ఆయన ఆదేశించారు.