|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 10:57 AM
ఈ రోజు పటాన్‌చేరు నియోజకవర్గం ఆమీన్పూర్ మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలో నూతనంగా ప్రారంభమైన కల్ట్ ఫిట్‌నెస్ జిమ్‌ను ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు గారు, దుబ్బాక ఎమ్మెల్యే కోత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఎస్సీ–ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు, పటాన్‌చేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి గారు మరియు బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీ కాటరాజేష్ గౌడ్ గారు ఇతరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.నూతన తరానికి ఆరోగ్యమే మహాభాగ్యం అనే భావనతో, యువత ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ ఆధునిక జిమ్ ఎంతో ఉపయుక్తం అవుతుందని నేతలు పేర్కొన్నారు. పటాన్‌చేరు పరిధిలో ఈ విధమైన హెల్త్ & ఫిట్‌నెస్ సదుపాయాలు పెరిగితే, యువత శారీరకంగా, మానసికంగా మరింత దృఢంగా ఎదుగుతారని నాయకులు అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ— స్థానిక యువత ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెంచుకోవడం అభినందనీయం అని, భవిష్యత్తులో ఇలాంటి ఆరోగ్యకారక వసతుల పెంపు కోసం తాను ప్రత్యేకంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ఆరోగ్య భద్రత, క్రీడల ప్రోత్సాహం తమ ప్రాధాన్యతలలో ఒకటని చెప్పారు.కార్యక్రమంలో ఎక్స్ మున్సిపల్ కౌన్సిలర్లు,బి.ఆర్.ఎస్ నాయకులు, జిమ్ నిర్వాహకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.