|
|
by Suryaa Desk | Thu, Oct 02, 2025, 06:14 PM
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ స్థానంలో పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహరచన ప్రారంభించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి తన నివాసంలో ఈ అంశంపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హాజరుకాగా, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి ఎంపికపై ప్రధానంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో అన్ని అంశాలను బేరీజు వేసి, గెలిచే సత్తా ఉన్న ముగ్గురు ఆశావహుల పేర్లతో సమగ్ర నివేదికను తనకు అందించాలని సీఎం వారిని ఆదేశించారు. అభ్యర్థి ఎంపిక విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని, అత్యంత పకడ్బందీగా వ్యవహరించాలని సీఎం స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.