|
|
by Suryaa Desk | Sun, May 25, 2025, 11:12 AM
అందాల పోటీల్లో పాల్గొన్న మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన సంచలన ఆరోపణలపై సీపీఐ నారాయణ స్పందించారు. అందాల పోటీలు మంచివికావని, ఆడవారిని కించపరిచే విధంగా ఉంటాయని చెప్తే తనపై విమర్శలు చేశారని అన్నారు. 'ఇప్పుడు అర్థమైందా? నేను ఎందుకు అలా మాట్లాడనో' అని అన్నారు. కాగా మిస్ ఇంగ్లాడ్ తనను ఓ వేశ్యలా చూశారని ఆరోపించిన విషయం తెలిసిందే.కాగా, మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న ఉత్సాహంపై నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి, ఉద్యోగుల జీతాలు పెంచకుండా, అందాల పోటీల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు. 'కోట్లల్లో ఖర్చు పెట్టేది సొల్లు కార్చుకోవడానికా?' అంటూ తీవ్ర వ్యాఖ్యులు చేశారు.